Quality electricity | పెద్ద కొడప్ గల్ , జూన్ 22: ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని పెద్ద కొడప్ గల్ విద్యుత్ ఎఈ పవన్ కుమార్ పేర్కొన్నారు. పెద్ద కొడప్గల్ శివారులో 33 కేవీ లైన్ ఏబీ స్విచ్ బిగించడం జరిగిందని తెలిపారు. పెద్ద కోడాపుగల్, శివపూర్ సబ్ స్టేషన్ లకు నిరంతర విద్యుత్ ఇవ్వడానికి అవకాశం ఉన్నపటికీ గతంలో ఏబీ స్విచ్ లేకపోవడం వల్ల బిచ్కుంద నుంచి ఏ చిన్న సమస్య వచ్చినా బిచ్కుంద, పెద్ద కొడప్ గల్ లైన్ కు అంతరయం వచ్చేదని, ఇప్పుడు ఏబీ స్విచ్ పెద్ద కొడప్ గల్ లో బిగించడం వల్ల తాత్కాలికంగా విద్యుత్తును బిచ్కుంద, పిట్లం నుంచి తీసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ పని పూర్తి చేయడానికి సహకరించిన విద్యుత్ వినియోగదారులు అందరికీ ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో లైన్ మెన్ కాశీరం, రాజేష్ పాల్గొన్నారు.