Election promises | కోటగిరి, జూలై 16 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో దివ్యాంగులతో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దెనెక్కి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరిచిందని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దివ్యాంగులకు ఆసరా పెన్షన్ పెంచుతానని చెప్పి ఇంతవరకు పెంచలేదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వంద శాతం దివ్యాంగులకు ప్రతీ నెల రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈనెల 18న నిజామాబాద్ లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రానున్నారని తెలిపారు. అన్ని వర్గాల వారు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సన్నాహాక సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు శ్రీకాంత్, వీహెచ్పీఎస్ మండల బాధ్యులు గొల్ల శ్రీనివాస్, శివకుమార్, వెంకట్రావు, సావిత్రి, నాగవ్వ తదితరులు పాల్గొన్నారు.