లింగంపేట్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల పరిధిలో ముంబాజిపేట గ్రామానికి చెందిన మాదిగ కాశవ్వ (60 ) అనే వృద్ధురాలు (Elderly woman) చెరువులో పడి మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆమె కోసం పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం భవానిపేట్ , ముంబాజిపేట్ గ్రామ శివారుల మధ్య సింగయ్య చెరువులో ( Pond ) కాశవ్వ మృతదేహం నీటిపై తేలింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు చెరువు వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.