ఆర్మూర్, ఆగస్టు 31: ఆర్మూర్ పట్టణానికి చెందిన ఎంజే దవాఖాన వైద్యుడు, చేయూత స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు , బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ మధుశేఖర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్‌గా గురువారం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, రైతు నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు, ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్స య్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, ప్రజాపంథా, న్యూడెమోక్రసీ నాయకులు ప్రభాకర్, దేవరాం. చేయూత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తులసీదాస్క్రాంతి, జనార్ధన్‌గౌడ్, రాకేశ్చంద్ర, గంగాధర్, ధర్మపురి , సాగర్, జీజీ రాం, పోలసుధాకర్, దళిత సంఘం నాయకులు అశోక్, కోటేశ్వర్, పెద్ద భోజన్న, గంగాధర్, దేవరాం,గంగాధర్,వైద్యులు పాల్గొన్నారు.