గత ఏడాది చివర్లో విడుదలై వెయ్యికోట్ల విజయాన్ని అందుకున్న సినిమా ‘దురంధర్’. రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సీక్వెల్ కోసం పానిండియా ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘దురంధర్: ది రివైంజ్’ పేరుతో రానున్న ఈ హై ఆక్టేన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఇందులో జస్కిరత్సింగ్ రంగీ, హమ్జా.. అనే రెండు విభిన్న అవతారాల్లో రణవీర్‌సింగ్ కనిపించనున్నారు. ఈ కథలో ఈ సారి సంఘర్షణ మరింత వ్యక్తిగతంగా మారుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో శనివారం(నేటి) ఉదయం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ధర్ నిర్మించిన ఈ చిత్రానికి జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాయి.