కంటేశ్వర్ : నిజామాబాద్ పట్టణంలో వ్యాపారస్థులు , ప్రజలు పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ( Commissioner Dilip Kumar) కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు వ్యాపార, వాణిజ్య సముదాయాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో పన్ను బకాయిలు ( Taxes ) ఉన్న వారు వెంటనే తమ పన్నులు చెల్లించాలని అన్నారు. ఇ
ప్పటికే నగరంలో దాదాపుగా 20వేలకు పైగా నోటీసులు (Noticess) అందజేశామని, పనులు చెల్లించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం తనిఖీలలో భాగంగా నగరంలోని వినాయక నగర్లో ఉన్న ఐస్‌క్రీమ్ పార్లర్ (Ice Creame Parlour) గత కొన్ని సంవత్సరాలుగా పన్ను చెల్లించడం లేదని గమనించిన మున్సిపల్ అధికారులు ఐస్ క్రీం పార్లర్‌ను సీజ్ చేశారు. విశాల్ మార్ట్ , ఎల్జీ షోరూం, ఐడీఎఫ్సీ బ్యాంకు బిల్డింగ్, ఇతర పలు వ్యాపార సముదాయాలను తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్ , ఇతర వివరాలను పరిశీలించారు. పన్ను బకాయిలు ఉంటే ఎంతటి వారినైనా వదిలేది లేదని, కచ్ఛితంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. తనిఖీలలో కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.