నిజామాబాద్ : వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. మేకల మందపై దాడి చేసి పలు మేకలను చంపేశాయి. ఈ సంఘటన జిల్లాలోని బాల్కొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు మండ కేంద్రానికి చెందిన సిరికంటి గంగమల్లుకు చెందిన మేకల మంద పై రాత్రి కుక్కలు దాడి చేసాయి. ఈ ఘటన లో 6 మేకలు మృతి చెందాయని, మరి కొన్ని మేకలకు గాయాలు అయ్యాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.