ఎల్లారెడ్డి/ రామారెడ్డి/ తాడ్వాయి/ కామారెడ్డి/ బాన్సువాడ/ బీర్కూర్/ నస్రుల్లాబాద్/ భిక్కనూరు, ఏప్రిల్3: తెలంగాణ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివని పలువురు ప్రజాప్రతినిధులు, కుర్మ సంఘం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కొమురయ్య జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కుర్మ సంఘం నాయకులు కుర్మ సాయిబాబా, రామకృష్ణ, జావిద్, అశోక్, సాయిబాబా, రాజు పాల్గొన్నారు. రామారెడ్డి మండలం పోసానిపేట్‌లో దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. కుర్మ సంఘ భవనంలో ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ నరేశ్, సాకలి తిరుపతి, బాపురెడ్డి, టంకరి రవి, కుర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు. తాడ్వాయి మండలంలోని తాడ్వాయి, బ్రాహ్మణపల్లి, దేవాయిపల్లిలో దొడ్డి కొమురయ్య చిత్రపటాలు, విగ్రహాలకు ప్రజాప్రతినిధు లు, కుర్మ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. తాడ్వాయి సర్పంచ్ సంజీవులు, వైస్ ఎంపీపీ నర్సింహులు, బీసీ యూత్ మండల అధ్యక్షుడు రాజీవ్‌కుమార్, ప్రధానకార్యదర్శి అఖిల్రావు పాల్గొన్నారు.
కామారెడ్డిలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బీఆర్ఎస్ నాయకులు దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి యాదవ్, యూత్ సంఘం అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు భూమేశ్‌యాదవ్, నాయకులు సంగమేశ్వర్, రాజలింగం, శ్రీనివాస్, చరణ్, సాయి, దినేశ్, అశ్వక్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తాలో కుర్మ సంఘం ప్రతినిధులు కుర్మ బీరప్ప ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల కుర్మ సంఘం నాయకులు, జిల్లా ప్రధాన కారదర్శి గణేశ్, బీర్కూర్ మండల అధ్యక్షుడు బీరప్ప, నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడు భాస్కర్, శ్రీనివాస్, మల్లుగొండ, పీరుగొండ, కుర్మ విఠల్, అయిలుగొండ, గౌరారం రాజు, సాయిలు తదితరులు ఉన్నారు. బీర్కూర్తోపాటు బరంగేడ్గి గ్రామంలో దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు. కుర్మసంఘం నాయకులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు కుర్మసంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీర్కూర్ కుర్మసంఘం మండల అధ్యక్షుడు బీరుగొండ, బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు మైత్రి బీరప్ప, మేత్రి భూమయ్య, బాబుగొండ, బరంగేడ్గి అధ్యక్షుడు లక్కపల్లి శ్రీనివాస్, లక్కపల్లి బీరుగొండ, సాయిలు, బాన్సువాడ సాయిలు, సంఘ పెద్దలు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో మండల కుర్మ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు భాస్కర్, యువజన సంఘం అధ్యక్షుడు కాశీరాం, సాయి గొండ, రాజశేఖర్, బాలుగొండ, సంగొండ, సాయికుమార్, లక్ష్మణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు, పెద్దమల్లారెడ్డిలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతిని నిర్వహించారు. భిక్కనూరు ఉప సర్పంచ్ బోడ నరేశ్, కుర్మ సంఘం జిల్లా యువజన అధ్యక్షుడు స్వామి, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ మల్లేశం, సంతోష్, భూపాల్, మల్లేశం, పెద్దమల్లారెడ్డి ఎంపీటీసీ సాయాగౌడ్, నాయకులు రాజలింగం, కుర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు.