Armoor | ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని డీఎంహెచ్ఓ రాజశ్రీ శనివారం అకస్మాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతీ రెండో శనివారం ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రులను సందర్శన నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో తెలిపారు. ఈ ఆరోగ్యం కార్యక్రమం లో భాగంగా సందర్శించినట్లు వివరించారు.
ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం డీఎంహెచ్ఓ రాజశ్రీ కి ఆసుపత్రికి వచ్చిన వారు ఆస్పత్రిలో పలు రకాల సౌకర్యాలు లేవని ప్రశ్నించారు. సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్వోను కోరగా త్వరలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.