Asian Swimming Championships-2025 | ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్-2025కు ఇండియా తరఫున జిల్లా స్విమ్మింగ్ క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక ఎంపిక
ఏషియన్ స్విమ్మింగ్ పోటీలు భారతదేశం లో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 11 వ ఏషియన్ అక్విటిక్ ఛాంపియన్షిప్ 2025 స్విమ్మింగ్ పోటీలు ఇండియాలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు దేశంలోని అక్విటిక్ స్టేడియం వీర సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో 28 సెప్టెంబర్ 2025 నుండి 1అక్టోబర్ 2025 వరకు జరుగనున్నాయి.
Asian Swimming Championships-2025 | కంటేశ్వర్ ఆగస్టు 22 : ఏషియన్ స్విమ్మింగ్ పోటీలు భారతదేశం లో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 11 వ ఏషియన్ అక్విటిక్ ఛాంపియన్షిప్ 2025 స్విమ్మింగ్ పోటీలు ఇండియాలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు దేశంలోని అక్విటిక్ స్టేడియం వీర సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో 28 సెప్టెంబర్ 2025 నుండి 1అక్టోబర్ 2025 వరకు జరుగనున్నాయి. కాగా ఏషియన్ దేశాల స్విమ్మింగ్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక ఇండియా తరఫున ఆడేందుకు ఎంపికైనట్లు సిమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీ మోనాల్ చౌక్ షి ప్రకటించారు.
ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 26వ తేదీ వరకు జరుగు ప్రత్యేక శిక్షణ లో పాల్గొనాలని సూచించారు. శిక్షణ ఎక్విటిక్ స్టేడియం వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అహ్మదాబాద్ లో జరుగునని తెలిపారు. ఏషియన్ దేశాలతో పోటీ పడటానికి మన దేశం తరఫున పాల్గొంటున్న మిట్టపల్లి రిత్వికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి , కార్యదర్శి ఉమేష్, ఉపాధ్యక్షుడు జీ మైపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడిల శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు శ్యాంసుందర్ రెడ్డి, వేణుగోపాల్, కైసర్, కర్ణాటక శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ముత్యాల శ్రీనివాస్, రాగిణి తదితరులు అభినందించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

