ఖలీల్వాడి, నవంబర్ 16 : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఓటమిని ఒప్పుకోవద్దని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. ఒక ప్రయత్నంలో ఉద్యోగం రాకపోతే వెనుకంజ వేయకుండా మళ్లీ ప్రయత్నించాలని, గమ్యం చేరేదాకా వదలొద్దన్నారు.
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నగరంలోని చంద్రశేఖర్కాలనీలో ఉన్న ప్రాంతీయ గ్రంథాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి తన అనుభవాలను వివరించారు. 2003 నుంచి 2013 పదేండ్ల పాటు కష్టపడ్డానని, దాదాపు 9 నోటిఫికేషన్లలో సాధించకపోయినా పదో నోటిఫికేషన్లో సాధించి, జిల్లా జడ్జిగా నియామకమైనట్లు చెప్పారు.