వినాయక్‌నగర్, సెప్టెంబర్ 9: ఖేలో ఇండియా ఉమెన్స్ త్వైకాండో -24 నేషనల్ చాంపియన్ షిప్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికైనట్లు త్వైకాండో కోచ్ మనోజ్ కుమార్ తెలిపారు. సీనియర్ విభాగంలో చౌట్పల్లి నేహ (బ్లాక్ బెల్ట్), జూనియర్ విభాగంలో వై.సాక్షి అక్షర ఎంపికైనట్లు పేర్కొన్నారు.
వీరు ఈ నెల 11 నుంచి 14 వరకు తమిళనాడులోని డిండిగల్ జిల్లా కేంద్రంలో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా క్రీడాకారిణులను జిల్లా జడ్జి సునీత కుంచాల సోమవారం అభినందించారు. విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తైక్వాండో జిల్లా కోశాధికారి వెంకటరమణా గౌడ్, సాక్షి సంతోష్, కోచ్ మనోజ్ పాల్గొన్నారు.