KGF Trust | వినాయక్ నగర్, జూలై 27 : నిజామాబాద్ మండల పరిధిలోని మల్లారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో కేజీఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సోమవారం ఉచితంగా రైటింగ్ బోర్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా KGF ట్రస్ట్ ఫౌండర్ జేసీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై, పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
ప్రతీ చిన్నారికి విద్య, ఆరోగ్యం, క్రీడలు అనే మూడు ప్రధాన రంగాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి, ఆరోగ్య సేవలు, క్రీడా అవకాశాలను అందిస్తూ వారి భవిష్యత్ అభివృద్ధికి తమ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. , జనరల్ సెక్రటరీ నాగేందర్, ట్రస్ట్ సభ్యులు కలిసి విద్యార్థులకు రైటింగ్ బోర్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సేవ్లా, ప్రధానోపాధ్యాయులు అన్నం గోపాల్, ఉపాధ్యాయులు వెంకట్, రంగా కిషన్, ట్రస్టు జనరల్ సెక్రటరీ నాగేందర్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.