మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 9 , 10వ తరగతి విద్యార్థినులకు మోర్తాడ్ లయన్స్ క్లబ్ (Lions Club) ఆధ్వర్యంలో సానిటరీ నాప్కిన్స్ లను (Sanitary napkins) పంపిణీ చేశారు. వంద మంది విద్యార్థినిలకు సానిటరీ నాప్కిన్లను పంపిణీ చేయడంతో పాటు నాప్కిన్ల వాడకం వాడకం, శరీర పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గోపిడి సత్యనారాయణ, వంగరి శ్రీనివాస్, బోగ లింబాద్రి, మనోహర్, సంజీవ్ , తదితరులు పాల్గొన్నారు .