Kamareddy | నస్రుల్లాబాద్ మే 25: నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చర్ మైసమ్మ ఆలయానికి ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన చింతామణి సప్తగిరి 11 గ్రాముల బంగారు రెండు గాజులను ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఆదివారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుడు గడ్డం సాయిలు, చింతామణి సప్తగిరి, చింతామణి హైమావతి, కూతురు ఈప్సిత, కుమారులు ఆదవ్, రుద్రాన్ష్ తదితరులు పాల్గొన్నారు.