Gajyanayak Thanda | మాచారెడ్డి : మండలంలోని గజ్యానాయక్ తాండ గ్రామంలో బుధవారం రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం ను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్నిచేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నౌసిలాల్ నాయక్, మాచారెడ్డి మాజీ ఎంపీటీసీ రావుల ప్రభాకర్, మండల మైనార్టీ అధ్యక్షులు అస్లాం, గజ్జనాయక్ తండా గ్రామ అధ్యక్షుడు భూక్య బన్సీలాల్ నాయక్, జిల్లా సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్, నునావత్ గణేష్ నాయక్, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ పూల రాజు, గ్రామ యూత్ ప్రెసిడెంట్ గుడ్ల నరేష్, గ్రామ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ భూక్య సీతారాం రాథోడ్, గ్రామ సీనియర్ నాయకులు రాములు నాయక్, శంకర్ నాయక్, గణేష్, తోకల భాస్కర్, శ్రీధర్ రావు, వెంకట్ గౌడ్, భూక్య రవీందర్ నాయక్, మహేష్, అశ్రఫ్ ఖాన్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.