Orphaned students | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని అనాథ విద్యార్థులకు శుక్రవారం దుస్తులు పంపిణీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ ఏర్పాటు వార్షికోత్సవం సందర్భంగా యూనియన్ ప్రతినిధులు అనాథ బాలలకు ఒక్కో జత దుస్తులను అందజేశారు. అనాథ పిల్లలకు తమ వంతు సహకారం, ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సదరు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని నవ్య శ్రీ మాహిం బేగం మధుప్రియ నాగలక్ష్మి ఆదిత్యలకు దుస్తులను కార్యదర్శి నాగరాజు,అసిస్టెంట్ కార్యదర్శి రాధిక, నన్నపనేని బాలయ్య,సుధాకర్, తౌర్య, ఆనంద్ కుమార్ ల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలచంద్రం, ఉపాధ్యాయులు నగేష్ బాబు, సంజీవ్ కుమార్, శ్రీకృష్ణ,ఖైరాన్, రాకేష్,జ్యోతి, వనిత ఉన్నారు.