కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి (Kotagiri) మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం బాలమిత్ర ఫౌండేషన్ (Balamitra Foundation) హైదరాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు , ప్లేట్లను పంపిణీ చేశారు. ఫౌండేషన్ కోఆర్డినేటర్ రమేష్ బాబు మాట్లాడుతూ తల్లిదండ్రి లేని 34 మంది అనాధ బాలికలకు ఫౌండేషన్ ద్వారా దుప్పట్లు , ప్లేట్లను పంపిణీ చేశామన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ప్రత్యేక అధికారిణి సవితరాణి మాట్లాడుతూ సేవ కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులను ఆదుకుంటున్న సంస్థ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.