కోటగిరి, ఆగస్టు 17 : కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలను నీరు గార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ పథకాలను కొనసాగిస్తే కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందోనని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2023 ఎన్నికల సమయంలో మహిళలకు ప్రతినెల మహాలక్ష్మి పథకం కింద రూ.2500, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతినెల 1000 , ఆటో రిక్షా కార్మికులకు నెలనెలా 1000 పెన్షన్ ఇస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి 33 నెలలు గడుస్తున్నా వాటిని అమలు చేయలేదని విమర్శించారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి విధి విధానాలను ఏడాది కిందటే రూపొందించినప్పటికీ నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్, తెల్ల చిన్న అరవింద్, నజీర్ , వల్లభ పూర్ శ్రీనివాస్ గౌడ్, అంబాటి గంగా ప్రసాద్ గౌడ్, కప్ప సంతోష్, శంకర్ గౌడ్, గగన్ , దేవేందర్, ఫారూఖ్, కర్నె గజేంధర్, మారుతి,ఉమా కాంత్, విజయ్, కొత్తపల్లి రాజు, పోశెట్టీ, జలాల్, హన్మండ్లు, జయ సూర్య, రవి, వడ్ల శ్రీనివాస్, పాల గాంగారం, సందీప్, లక్ష్మి, మామిడి నవీన్, పాషా శివ, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.