‘హిట్’ ఫ్రాంఛైజీతో యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను తన పంథాకు భిన్నంగా రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఏమో ఏమో ఇది’. యువ హీరో రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్నారు. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకురానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఏమో ఏమో ఇది’ అనే టైటిల్‌సాంగ్‌ని విడుదల చేశారు.
ప్రేమలోని ఉత్సాహాన్ని, మనసులోని మధుర భావాలకు అద్దం పడుతూ మెలోడీ ప్రధానంగా ఈ పాట సాగింది. మంచు కొండల అందాలు, చక్కటి విజువల్స్‌తో ఈ పాట హృదయానికి హత్తుకునేలా సాగింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించిన ఈ పాటను కార్తీక్, రమ్య బెహరా ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు.