అమితాబ్‌బచ్చన్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ డ్రామా ‘పా’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఆర్.బాల్కీ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో దాదాపు 17 ఏండ్ల విరామం తర్వాత దర్శకుడు ఆర్.బాల్కీ, విద్యాబాలన్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. వీరిద్దరూ తమిళ సినిమా కోసం చేతులు కలిపారు. మంగళవారం ఈ సినిమా ప్రారంభమైంది. ఈ విషయాన్ని విద్యాబాలన్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.
ఓ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నామని విద్యాబాలన్ ఆనందం వ్యక్తం చేసింది. ‘పా’ చిత్రంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, విద్యాబాలన్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఎలాంటి వివరాలను మేకర్స్ వెల్లడించలేదు. ప్రస్తుతం విద్యాబాలన్ తమిళంలో ‘జైలర్-2’ చిత్రంలోనూ భాగమవుతున్నది.