కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ప్రభుత్వ భూమిని (Government Land) కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాటిని రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలని గ్రామస్థులు తహసీల్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా (Dharna) చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ 1314 సర్వే నంబర్లోని 15 గుంటల ప్రభుత్వ భూమితో పాటు వాటి పక్కనే ఉన్న 161 బీటీ రోడ్డు (BT Road) హద్దులను సైతం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అధికారులు స్పందించి ప్రభుత్వ భూముల్లో సర్వే చేపట్టి హద్దులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పి మోహన్ రావు. గాండ్ల శ్రీనివాస్,ఏముల నవీన్, మామిడి శ్రీనివాస్, మహేష్ రెడ్డి, వడ్ల శ్యామ్, సాయి ప్రసాద్, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.