Gram panchayat workers | కోటగిరి : గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నే సాబ్ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కోటగిరి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని, కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కోటగిరి గ్రామపంచాయతీలో 30 మంది కార్మికులు పని చేస్తున్నారని, వారికి మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని, వేతనాలు చెల్లించకపోతే వారు ఏం తినాలని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని చెల్లించే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అనంతరం కార్యాలయంలో ఎంపీడీవో చాంబర్ ఎదుట పంచాయతీ కార్మికులు బైఠాయించారు. వెంటనే వేతనాలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నా లో సిఐటియు జిల్లా నాయకులు నాగన్న, పంచాయతీ కార్మికులు ఉన్నారు.