శక్కర్‌నగర్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గంజి రోడ్లో గల శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలోని మారుతి మందిరంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి విశిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సాయిబాబాకు అభిషేకం, ప్రత్యేక అలంకరణ జరిపి పూజలు జరిపారు. అనంతరం బాబా అలంకరణ తరువాత భక్తులందరికీ బాబా పాదదర్శనానకి అనుమతించారు.
మధ్యాహ్న హారతి అనంతరం అన్నప్రసాద వితరణ జరిపించారు. ఆలయ నిర్వాహకులు కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్దలతో శాస్త్రోక్తంగా జరిపించారు. సాయంత్రం సంధ్య హారతి.. పల్లకి సేవ చేపట్టారు. శేజహారతితో కార్యక్రమాలు ముగిసాయని ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ కులకర్ణి అశోక్ రావు, కోశాధికారి పబ్బ మురళి తెలిపారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.