Armoor | ఆర్మూర్‌లో ప్రగతి పరుగులు.. వందలాది కోట్ల నిధులతో అభివృద్ధి పనులు
Armoor | ఆర్మూర్ నియోజికవర్గం అభివృద్ధికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. తొమ్మిదేండ్ల కాలంలో వందలాది కోట్ల నిధులతో అపూర్వమైన ప్రగతి సాధించింది.
Armoor | నందిపేట్, నవంబర్ 2 : ఆర్మూర్ నియోజికవర్గం అభివృద్ధికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. తొమ్మిదేండ్ల కాలంలో వందలాది కోట్ల నిధులతో అపూర్వమైన ప్రగతి సాధించింది. రోడ్లు, మురికి కాలువలు, వంతెనలు, దవాఖానలు, పాఠశాలలు, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్, కొత్త మండలాలు, కొత్త పంచాయతీల ఏర్పాటు, ఎత్తిపోతల పథకాల ఆధునీకరణ, ఆర్మూర్‌లోని సిద్దుల గుట్టకు ఘాట్ రోడ్డుతో పాటు గుట్టపై అభివృద్ధి పనులు, నిర్మాణాలు, ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు, ఆయా గ్రామా ల్లో బైపాస్ రోడ్ల నిర్మాణం, ప్రత్యేక నిధులతో ఆర్మూర్, నందిపేట్ పట్టణాల సుందరీకరణ ఇలా ఎన్నో ప్రగతి పనులతో ఆర్మూర్ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలుస్తున్నది.
రూ. 120 కోట్లతో గోదావరిపై వంతెన
నిజామాబాద్, నిర్మల్ జిల్లాలను కలుపుతూ నందిపేట్ మండలం ఉమ్మెడ పాత గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించిన వంతెన రెండు ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. సుమారు రూ. 120 కోట్లతో నదిపై వంతెన నిర్మించడంతో 50 కిలో మీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దూరం 10 కిలోమీటర్లకు తగ్గింది. గతంలో రెండు ప్రాంతాల ప్రజలు పుట్టి (నాటు పడవ) ద్వారా ప్రమాదకర పరిస్థితుల్లో నది దాటుతుండేవారు. ఇప్పుడు వంతెన నిర్మాణంతో ఎంతో సౌకర్యవంతమైంది.
చేరువైన పాలన…
ఆర్మూర్‌తో పాటు బాల్కొండ నియోజకవర్గాల ప్రజల దశాబ్దాల కల అయిన రెవెన్యూ డివిజన్ ఆర్మూర్‌లో ఏర్పడింది. అలాగే డొంకేశ్వర్, ఆలూర్ మండలాల ఏర్పాటుతో కొత్త కార్యాలయాలు ఏర్పాటై పరిపాలన సౌలభ్యంగా మారింది.
కల్యాణ మండపాలకు కేరాఫ్ అడ్రస్
నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో మండపాల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. సుమారు రూ.10 కోట్లకు పైగా వ్యయంతో మండపాల నిర్మాణాలు జరుగుతున్నాయి.
సమస్యలు తీర్చిన బైపాస్ రోడ్లు…
గ్రామాల్లోని ఇరుకు రోడ్లతో తరుచూ పడుతున్న ఇబ్బందులను గమనించి ప్రభుత్వం బైపాస్ రోడ్లను మంజూ రు చేసింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయాయి.
అగ్రగామిగా ఆర్మూర్ సర్కారు దవాఖాన
పేదవారికి ప్రసవం అనగానే ప్రైవేటు దవాఖాన కాకుండా ఆర్మూర్ ప్రభుత్వ దవాఖాన గుర్తుకు వచ్చేలా సేవలందుతున్నాయి. 30 పడకల స్థాయి నుంచి 100 పడకల స్థాయికి పెంచారు. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో డయాలసిస్ సెంటర్‌ను మంజూరు చేయించి ప్రారంభించారు. ఆర్మూర్, నిజామాబాద్ ప్రధాన రోడ్డును ఆనుకొని మాక్లూర్ మండలం పరిధిలోని చిన్నాపూర్ సమీపంలో రూ. 50 కోట్ల వ్యయంతో అర్బన్ పార్కును తీర్చిదిద్దారు.
రూ. 250 కోట్లతో రోడ్లు…
నియోజకవర్గంలో సుమారు రూ. 250 కోట్లతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లను నిర్మించారు. మారుమూలలో ఉన్న ప్రతి పల్లెకు తారు రోడ్డు సౌకర్యం ఏర్పాటయ్యింది. మండలాల నుంచి జిల్లా కేంద్రానికి, నియోజకవర్గ కేంద్రానికి తళుక్కుమనే డబుల్ రోడ్లు వందలాది కిలోమీటర్ల పొడవునా నిర్మాణాలు జరిగాయి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

