ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 30: అభివృద్ధికే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నగరంలోని పలు డివిజన్లలో కోటి రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ఇప్పటికే ఆహ్లాదకరమైన వాతావరణంతో మినీ ట్యాంక్ బండ్, ఆధునిక సదపాయాలతో వైకుంఠధామాలు నిర్మించామని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఐటీ టవర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. స్థానిక యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు న్యాక్ భవనాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. నగర ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సిర్ప రాజు, ఎనుగందుల మురళి, 41వ డివిజన్ కార్పొరేటర్ బురుగుల ఇందిరా, పార్టీ నగర అధ్యక్షురాలు చాంగుబాయి, నాయకులు పాల్గొన్నారు.