National highway | పోతంగల్ జూన్ 19: జాతీయ రహదారి 161 బీబీ నిర్మాణ పనుల కోసం అవసర మైన భూసేకరణ వివరాలు త్వరగా పూర్తిచేయలని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహతో గురువారం సందర్శించారు. మద్నూరు నుండి రుద్రూరు బోధన్ మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిర్మాణంవల్ల పోతంగల్ మండలంలో కోల్పోతున్న భూముల వివరాలు, సర్వే చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ధరణి పెండింగ్ ఫైల్స్ గురించి ఆరా తీశారు.
పెండింగ్ ఫైల్స్‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు. మండలంలో భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలిస్తూ నిర్ణీత గడువులోపు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ గంగాధర్ రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.