రెంజల్,జూన్ 7: ‘సార్లు లేని బడిలో పిల్లలను చేర్పించం’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు డీఈవో ఎన్వీ దుర్గాప్రసాద్ స్పందించారు. రెంజల్ మండలం కందకుర్తి జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాలలో డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని నమస్తే తెలంగాణతో ఫోన్లో తెలిపారు.
పాఠశాల పునఃప్రారంభం నాటికి పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల మేరకు డిప్యుటేషన్‌పై సరిపడా ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని డీఈవో కోరారు.