కామారెడ్డి, అక్టోబర్ 29 : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. కామారెడ్డి పట్టణంలో ర్యాలీ చేపట్టి, స్థానిక నిజాంసాగర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు రాక విద్యార్థులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రా్రష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ఏబీవీపీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ రోహిత్, ఖలీల్, కార్యకర్తలు వెంకటేశ్, రాజు, నవీన్, మానస, శివ, రాకేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
కామారెడ్డి, అక్టోబర్ 29 : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆ ధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం దీక్ష నిర్వహించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, వెంకట్‌గౌడ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్, కార్యదర్శి అజయ్, నాయకులు మణికంఠ, సమీర్, రాహుల్, నితిన్, సాయి, విద్యార్థులు పాల్గొన్నారు.