Deer killed | పోతంగల్, మే 25 : వీధి కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందిన ఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని సోంపుర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, అటవీశాఖ బీట్ ఆఫీసర్ వందన కథనం ప్రకారం.. మండలంలోని సోంపుర్ వ్యవసాయ పొలల్లో నుండి గ్రామం వైపునకు వీధి కుక్కలు జింకను తరిమి దాడి చేయడంతో జింక మృతి చెందింది.
స్థానికులు గమనించి వీధి కుక్కలను తరిమివేశారు. వెంటనే జింక మృతి చెందిన విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని జింక ను పంచనామా చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. వీధి కుక్కలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మనుషుల పై కూడా దాడులు చేస్తున్నాయి. వీధి కుక్కల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అని కోరుతున్నారు.