గాంధారి : గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ ( Sevalal Maharaj ) జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా (Sevalal Jayanti) ప్రకటించాలని ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం నాయకులు కోరారు. శుక్రవారం గాంధారి మండల కేంద్రంలో బంజారా సంఘం నాయకులు సమావేశమై మాట్లాడారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈనెల 15న సెలవు దినంగా ప్రకటించాలని, రాష్ట్ర మంత్రి వర్గంలో గిరిజన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ( Ministerial position ) ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాధా బలరాం నాయక్, శంకర్ నాయక్, గంగాధర్, మిట్య నాయక్, ప్రేమ్ దాస్, సక్రం నాయక్ , గబ్బర్ సింగ్ , సురేందర్, తులసి రామ్ తదితరులున్నారు.