కామారెడ్డి, జూలై 18 : జిల్లాలో 49,541 మంది రైతులకు రూ.235 కోట్ల 61 లక్షలు మాఫీ చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వీసీలో తెలిపారు.కామారెడ్డి మండలం క్యాసంపల్లి రైతువేదికలో నిర్వహించిన వీసీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు, రైతులతో మాట్లాడారు.
రుణమాఫీకి అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాలతో జాబితాలో లేని రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని, డీఏవోలో హెల్ప్‌లైన్ 7288894616 నంబర్‌ను ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.