ధర్పల్లి, మే 6 : మండల కేంద్రంలో నిర్మించిన 48 డబుల్ బెడ్ రూం ఇండ్లను పేదలకు అందించాలని, లేనిపక్షంలో వారిచేత ఇండ్లను ఆక్రమింపజేస్తామని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ నాయకులు అన్నారు. ఈ మేరకు ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేశ్ ఆధ్వర్యంలో మహిళలు మంగళవారం తహసీల్దార్ మాలతికి వినతిపత్రం సమర్పించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా కాలయాపన చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇండ్లను పంపిణీ చేసి, పేదల సొంతింటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో స్వరూప, లక్ష్మి, శారద, జమున, సులోచన, నూర్జహాన్, సహనాబేగం, నాయకులు ఉన్నారు.