CPI | కోటగిరి : కేంద్ర బడ్జెట్ను సవరించడంతో పాటు కులగణనపై త్వరితగతిన కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ దుభాష్ రాములు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద వర్గాలకు కాకుండా కార్పొరేట్ వ్యక్తులకు, సంపన్న వర్గాల కోసం కేటాయించిన పద్ధతిలో కేంద్ర బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ను వెంటనే సవరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ బిల్లును ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పార్లమెంటుకు పంపడాన్ని సీపీఐ స్వాగతిస్తుందన్నారు. బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆమోదింపజేసి బీసీ బిల్లును ముందుకు తీసుకురావాలన్నారు. లేకపోతే బీసీల పట్ల చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్, నల్ల గంగాధర్, శంకర్, నాగరాజు, బాలరాజు, సతీష్ ఉన్నారు.