విద్యార్థినులకు వేధింపులు.. విధుల నుంచి అధ్యాపకుల తొలగింపు
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు ఒప్పంద అధ్యాపకులపై అధికారులు వేటువేశారు. బాన్సువాడ మండలంలోని ఓ పాఠశాల/కళాశాలలో పని చేస్తున్న ఇద్దరు ఒప్పంద అధ్యాపకులు వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు స్వయంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
- బాన్సువాడ మండలంలోని ఓ కళాశాలలో ఘటన
బాన్సువాడ రూరల్, జూలై 18 : విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు ఒప్పంద అధ్యాపకులపై అధికారులు వేటువేశారు. బాన్సువాడ మండలంలోని ఓ పాఠశాల/కళాశాలలో పని చేస్తున్న ఇద్దరు ఒప్పంద అధ్యాపకులు వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు స్వయంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
స్పందించిన విద్యాశాఖాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో విద్యార్థినులు చేసిన ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ కావడంతో వారిద్దరినీ జిల్లా విద్యాధికారి మల్లికార్జున్ విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. విద్యార్థినులపై వేధింపుల విషయమై కళాశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ శనివారం తెలిపారు.
మహిళా అధ్యాపకురాలిని వేధించాడని ఇన్చార్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్
- ఎల్లారెడ్డి జూనియర్ కళాశాలలో ఘటన
ఎల్లారెడ్డి, జూలై 18: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ అధ్యాపకుడు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ నిజాంను సస్పెండ్ చేస్తూ ఇంటర్మీడియెట్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ గోపాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కళాశాలలో పనిచేస్తున్న ఓ మహిళా అధ్యాపకురాలిని వేధింపులకు గురి చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం విచారణ చేపట్టి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా అధ్యాపకురాలిని కరీంనగర్‌కు అటాచ్ చేసినట్లు సమాచారం.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

