విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మృతి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సివిల్ కానిస్టేబుల్ రామాంజనేయులు కోటి(40)ఆదివారం ఉదయం నిర్వహణ ఉన్న సమయంలోనే మృతి చెందాడు. ఐదో ఠాణా సిబ్బంది తెలిపిన మేరకు వివరాలు ఇలావున్నాయి.
- గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 24 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సివిల్ కానిస్టేబుల్ రామాంజనేయులు కోటి(40)ఆదివారం ఉదయం నిర్వహణ ఉన్న సమయంలోనే మృతి చెందాడు. ఐదో ఠాణా సిబ్బంది తెలిపిన మేరకు వివరాలు ఇలావున్నాయి. 2009వ బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్‌గా ఉన్న కోటి గతంలో భీమ్‌గల్‌లో విధులు నిర్వర్తించి అక్కడి నుంచి బదిలీపై నిజామాబాద్ ఐదో టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. నగరంలోని మహాలక్ష్మి నగరలోని కోటి శనివారం నైట్ డ్యూటీ చేసి స్టేషన్లోనే ఉన్నాడు. ప్రతి రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం 9.45 గంటలకు ఠాణాలో ఇతర సిబ్బందితో కలిసి రోల్‌కాల్‌లో పాల్గొన్నాడు. 10 గంటలకు డ్యూటీ నుంచి రిలీవ్ అయ్యాక ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
ఇంతలోనే తనకు తిప్పినట్లు అవుతుందని కొద్ది సమయం పాటు రెస్టు తీసుకుంటానని స్టేషన్ పై అంతస్తులో ఉన్న హాల్లోకి వెళ్లాడు. అప్పుడే వాంతులు కావడంతో పాటు చెమటలు పట్టి కింద పడిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య రోజా, పిల్లలు సాన్విక,త్రిషిక ఉన్నారు. కోటి మృతితో తోటి సిబ్బంది, బ్యాచ్‌మెట్స్ తీవ్ర ద్రిగ్భాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అదనపు డీసీపీ జయరామ్, ఏసీపీ కిరణ్ కుమార్, నార్త్ రూరల్ సీఐ సతీశ్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు కోటి మృతదేహానికి నివాళులు అర్పించారు. అంత్యక్రియల కోసం ఆయన సతీమణికి రూ.20వేలు అందజేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

