మద్నూర్, ఆగస్టు 24 : మండలంలోని మెనూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల కేంద్రంతోపాటు అంతాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం బీఆర్ఎస్లో పార్టీలో చేరారు. వారికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు తైదల్వార్ రాజు, విఠల్పటేల్, బాబూమియా తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ.. ప్రలోభాలకు గురై పార్టీని వీడినవారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజులు మనవేనని, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బన్సీపటేల్, నాయకులు దరాస్ సురేశ్, పాకలి విజయ్‌కుమార్, గఫర్, గోవింద్, కాశీనాథ్పటేల్, నాగేశ్, గోపి, దేవీదాస్, రవి, రాజు, మారుతి, సంజు, హన్మాండ్లు, నర్సింహులుగౌడ్, మహ్మద్, ఎంకే పటేల్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.