నిజామాబాద్ : జిల్లాలోని వర్ని గ్రామం మాజీ సర్పంచ్ బాలా గౌడ్‌తో పాటుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా భాస్కర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.