బోధన్ రూరల్ : అధికారంలోకి రావడానికి అనేక హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ( Prem Maheshwar Reddy ) పిలుపునిచ్చారు. శుక్రవారం బోధన్ మండలంలోని అందాపూర్ గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచిన ఇప్పటివరకు పట్టభద్రులకు చేసిందేమీ లేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీపై ఆ పార్టీ నాయకులను ప్రశ్నించాలని కోరారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే అబద్ధపు హామీలను నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుధాకర్ చారి, సిర్ప సుదర్శన్, తదితరులు ఉన్నారు.