Nizamabad | కంటేశ్వర్, డిసెంబర్ 18 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గురువారం చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి, ధర్నా కార్యక్రమం పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా ఏఐసీసీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం వేధిస్తున్న సందర్భంలో ఈడి కేసులను కోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీజేపీ అరాచకాలను నిలదీస్తూ ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ నాయకులు గురువారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు కాంగ్రెస్ బయలుదేరి వెళ్తుండగా స్థానిక కోర్టు చౌరస్తా వద్ద పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.