ఏర్గట్ల, నవంబర్ 20 : ఏర్గట్ల మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు అరుణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో వారికి గురువారం గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. హామీలు అమలు చేసే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, బర్మ చిన్ననర్సయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మధు తదితరులు పాల్గొన్నారు.