PM Modi | ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరికి, రాజీ వైఖరికి తావులేదు : ప్రధాని మోదీ
PM Modi | ఉగ్రవాదం (Terrorism) విషయంలో భారత్ రాజీపడబోదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి స్పష్టంచేశారు. మలేషియా (Malaysia) పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrhim) తో ప్రధాని భేటీ అయ్యారు.
PM Modi : ఉగ్రవాదం (Terrorism) విషయంలో భారత్ రాజీపడబోదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి స్పష్టంచేశారు. మలేషియా (Malaysia) పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrhim) తో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, జాతీయ భద్రత, సెమీ కండక్టర్లు, వాణిజ్యం సహా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు.
సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్కు మలేషియాతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. ఇరు దేశాలు విభిన్న రంగాల్లో సంబంధాలను మరింత శక్తిమంతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదంపై తమ సందేశం స్పష్టంగా ఉందని అన్నారు. ఈ విషయంలో ద్వంద్వ వైఖరికి, రాజీ వైఖరికి తావులేదని స్పష్టంచేశారు.
భారత్-మలేషియా దేశాలు సముద్ర సరిహద్దులు పంచుకుంటున్నాయని, ఇరుదేశాల ప్రజల మధ్య లోతైన ఆత్మీయ బంధం ఉన్నదని ప్రధాని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచానికి వృద్ధి యంత్రంగా మారిందని పేర్కొన్నారు. భారత్-మలేషియా మధ్య ఆరు కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు. అంతకుముందు కౌలాలంపూర్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

