హైదరాబాద్ : అనుకున్నదే అయింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (FSL) అగ్ని ప్రమాదం (Fire accident) లో ఓటుకు నోటు కేసు (Note for Vote case) ఆధారాలు బుగ్గి పాలయ్యాయి. దాదాపు అన్ని కేసులకు సంబంధించిన కీలక ఫైల్స్ తగలబడిపోయాయి. మొత్తం ఐదు రూమ్లలో ఉన్న కీలక ఫైల్స్ (Key files) కాలిపోయినట్లు తెలిసింది.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం ఐదు రూమ్లలోని కీలక ఫైల్స్ తగులబడిపోయాయని FSL ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆ ఐదు రూమ్లలో సర్వర్ రూమ్, కంప్యూటర్ ఫోరెన్సిక్ లాబరేటరీ, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలసిస్ ఛాంబర్ ఉన్నాయి. కాగా ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదంటూ నిన్న రాత్రి పోలీసులు ఒక నోట్ విడుదల చేయడం గమనార్హం.


