YS Jagan Mohan Reddy | ఒకే ఫ్రేమ్‌లో వైఎస్ జగన్, సూర్య, కార్తీ.. వీడియో వైరల్!
YS Jagan Mohan | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నై పర్యటనలో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలను కలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
YS Jagan Mohan | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నై పర్యటనలో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలను కలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చెన్నైలో జరిగిన తన సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు జగన్ హాజరుకాగా.. ఈ వేడుకలో సూర్య మరియు కార్తీ కూడా పాల్గొనడంతో వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ వివాహ వేడుకలో జగన్ ఎంతో ఆత్మీయంగా సూర్య, కార్తీలతో ముచ్చటించారు. వారందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు జగన్‌ను చూసేందుకు వివాహ వేడుక వద్ద అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. స్థానిక ప్రజలు కూడా ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఫిబ్రవరి 8న జరిగిన సాహిల్ – వేదికల వివాహానికి జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ ప్రముఖులు మరియు సినిమా స్టార్లు ఒకే వేదికపై ఇలా సందడి చేయడంతో అభిమానులు ఈ వీడియోని తెగ ట్రెండ్ చేస్తున్నారు.
Jagananna & Surya Brothers In One Frame ❤️
వైయస్ జగన్ గారి పెదనాన్న జార్జి రెడ్డి గారి కుమారుడు సునీల్ రెడ్డి యొక్క తనయుడు సాహిల్ వివాహ వేడుకలో పాల్గొన్నారు..@ysjagan @Suriya_offl pic.twitter.com/WFq7eWKQ1i
— Kampasati Ashok Yadav (@ashokyadav_AKY) February 8, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

