రెంజల్, ఫిబ్రవరి 15: తెలంగాణ ప్రజలను మో సం చేయడమే పనిగా సీఎం రేవంత్రెడ్డి ప్రభు త్వం పనిచేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండ ల లక్ష్మీనారాయణ విమర్శించారు. రెంజల్ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చక్కెర కర్మాగారంపై మంచి నిర్ణయం తీసుకుంటుందనుకున్న కార్మికులకు నిరాశే మిగిల్చారని అన్నారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయమై మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. గతంలో చేసిన హౌస్ కమిటీ సిఫారసులను విస్మరించి మరో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. రెంజల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. ఎంపీపీ లోలపు రజిని, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేక సంతోష్ కుమార్ పాల్గొన్నారు.