ఇంకెంత కాలం బీసీలను మోసం చేస్తారు?
బీసీలను ఇంకెంత కాలం, ఇంకెన్ని సార్లు మోసం చేస్తారని, రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తదని బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. శుక్రవారం..
– పరిషత్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు
– బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
నల్లగొండ, ఫిబ్రవరి 20 : బీసీలను ఇంకెంత కాలం, ఇంకెన్ని సార్లు మోసం చేస్తారని, రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తదని బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా బీసీ వ్యతిరేక వైఖరితో అణిచి పెడుతుంటే రాజకీయ పార్టీలన్నీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయన్నారు. కావునా బీసీలందరూ చివరి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఇప్పుడు 42 శాతం సాధించకపోతే భవిష్యత్లోనూ ఎప్పుడూ రాదన్నారు. ఒకవైపు హైకోర్టులో కేసు నడుస్తుంది. కోర్టు తీర్పు రాకముందే ఆదరా- బదరాగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కేసు వంద శాతం బీసీల పక్షాన రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్దంగానే ఉందని, కేసు తీర్పు బీసీల పక్షాన వస్తుందని భయపడే 17 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ బీసీలకు అన్యాయం చేయతలబెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు మేడబోయిన సాయికుమార్, అనంత్ నాగరాజుగౌడ్, కొంపెల్లి రామన్న గౌడ్, కుందారపు శివ, తాడూరి మహేష్, వీరేటి కృష్ణ, అంబటి స్వామి, భాషపాక శ్రీహర్ష, బైరగోని చందు, గుండబోయిన చరణ్ తేజ, మేడబోయిన తరుణ్ కుమార్ యాదవ్, సుంకరి గణేష్, గుండ్ర గణేష్, రామ్ చరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

