చిహ్నాలను తొలగిస్తే.. పోరాటమే
తెలంగాణ వారసత్వ చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్లను రాష్ట్ర అధికార ముద్ర నుంచి తొలగిస్తామన్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మొదలవుతున్నాయి. ప్రజలు, ఉద్యమకారులు, న్యాయవాదులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తెలంగాణ చరిత్ర తెలుసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
- నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి
- మండిపడుతున్న తెలంగాణ ఉద్యమకారులు, న్యాయవాదులు, ప్రజానీకం
తెలంగాణ వారసత్వ చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్లను రాష్ట్ర అధికార ముద్ర నుంచి తొలగిస్తామన్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మొదలవుతున్నాయి. ప్రజలు, ఉద్యమకారులు, న్యాయవాదులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తెలంగాణ చరిత్ర తెలుసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, అస్థిత్వ చిహ్నాలుగా ఉన్న కళాతోరణం, చార్మినార్‌ను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్ర నుంచి తొలగించాలన్న కాంగ్రెస్ సర్కారు సాంస్కృతిక, వారసత్వ సంపదపై దాడిగా చూస్తామని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి పాలకుల తీరుగానే ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తే మరోసారి తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుట్రలను అడ్డుకునేందుకు ఎంత వరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని నినదిస్తున్నారు.
మరో ఉద్యమంమొదలవుతుంది
తెలంగాణలో మళ్లీ ఉద్యమం మొదలు కాబోతున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ చరిత్రను చదువుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్లు చిహ్నాలను మార్చుకుంటూ పోతే ఊరుకునేది లేదు. తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ చరిత్ర గర్వపడేలా రాష్ట్ర అధికారిక ముద్రను తయారు చేశారు. రాజకీయంగా ప్రజలకు ఎలా మంచి చేయాలో చూడాలి. కానీ నువ్వు చేసే పనులకు తెలంగాణ కిందామీదా పడుతున్నది. తెలంగాణను నవ్వులపాలు చెయ్యకు రేవంత్ రెడ్డి.
-సత్యప్రకాశ్, ఉద్యమకారుడు
సీఎం ఎప్పుడైనా జై తెలంగాణ అన్నాడా?
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా, తెలంగాణ చరిత్ర అందరికీ తెలిసేలా ఉన్న చిహ్నాలను మార్చి ఏం పెట్ట దలుచుకున్నావ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం అయ్యి ఆరు నెలలవుతున్నది. ఏ సభలోనైనా, సమావేశంలోనైనా ఇప్పటి వరకు జై తెలంగాణ అని అన్నావా?. నీకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. జై తెలంగాణ అంటే మీ ఆంధ్రా నాయకులు ఒప్పుకోవడం లేదా? తెలంగాణ చిహ్నాలను ముట్టుకుంటే ఊరుకునేది లేదు.
– దాదన్నగారి మధుసూదన్‌రావు, ఉద్యమకారుడు(న్యాయవాది)
ఉద్యమ రుచి చూపిస్తాం..
తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లిన చరిత్ర ఉద్యమకారులది. తెలంగాణ కోసం ప్రాణాలని పణంగా పెట్టిన మా అమరవీరుల సాక్షిగా పుట్టిన చిహ్నాలు కాకతీయుల కళాతోరణం, చార్మినార్‌ను ముట్టుకుంటే ఉద్యమం అంటే ఏంటో చూపిస్తాం. గేయాన్ని మార్చడానికి మీకు ఎవ్వ రూ దొరకలేదా? అదేమైనా రాజకీయ గీతమా? అధికారం వచ్చిన ప్రభుత్వం మార్చడానికి. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావ్. ఇది ఆంధ్రా కాదు.. తెలంగాణ అనే విషయాన్ని మర్చిపోవద్దు. నిన్ను గెలిపించిన తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు.
– శ్రీనివాస్‌గౌడ్, ఉద్యమకారుడు
ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు..
తెలంగాణ రాష్ట్ర గేయాన్ని మార్చాల్సిన అవస రం ఎందుకు వచ్చిం ది. రాష్ట్ర అధికారిక చిహ్నాలను, గేయాన్ని మారుస్తామంటూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. తెలంగాణ చరిత్ర తెలియని నీకు చిహ్నాలను మార్చే అధికారం ఎవరు ఇచ్చారు. ఇప్పటి వరకు రైతులకు రైతుబంధు ఇవ్వలేదు, బోనస్ ఇవ్వలేదు ఇలాంటి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి.. తెలంగాణ చరిత్రను రూపుమాపే పని పెట్టుకున్నావా?
– రవిచందర్, ఉద్యమకారుడు
చిహ్నాల గురించి నీకేం తెలుసు?
తెలంగాణ చరిత్ర తెలియని సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారిక చిహ్నాలను ముట్టుకునే అర్హత లేదు. ముందు చరిత్ర తెలుసుకో. ప్రజా సంక్షేమం పై, పాలన మీద దృష్టి పెట్టకుండా…తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారు. కాకతీయుల కళాతోరణం, చార్మినార్ గుర్తులను అధికారముద్ర నుంచి తీసేయాలనుకోవడం సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనం.
– చామకూర ప్రభాకర్‌రెడ్డి, ఉద్యమకారుడు
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

