ఉమ్మడి జిల్లా సోమవారం ఆందోళనలతో అట్టుడికింది. సమస్యల పరిష్కారంపై రైతులు, జీపీ కార్మికులు, డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు సర్కార్‌పై పోరుబాట పట్టారు. ఇటీవల భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట తహసీల్ ఆఫీస్ ఎదుట జాతీయరహదారిపై అఖిల పక్షం నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, వారిని చిన్నచూపు చూస్తూ అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. తమకు మూడు నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ పంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కామారెడ్డి డీపీవో ఆఫీస్, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కోటగిరిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు వారం రోజుల్లో చెల్లించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 22: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవరిస్తున్నదని, వారిని చిన్నచూపు చూ స్తూ అరిగోస పెడుతున్నదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. పంట నష్టపరిహారంతోపాటు రైతుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై సోమవారం అఖిల ప క్షం నాయకులతో కలిసి రాస్తారోకో చేపట్టా రు.
ఈ కార్యక్రమంలో జాజాల పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సిం గూర్, నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌తో పంటలు నీట మునిగి నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం అందించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోనే ఎక్కుగా నష్టపోయింది నాగిరెడ్డిపేట మండలానికి చెం దిన రైతులని తెలిపారు. కానీ సీఎం కామారెడ్డిలో పర్యటించారన్నారు. తక్షణమే స్పందించి రైతులకు పరహారం అందించాలని డిమాండ్ చేశారు.
పోచారం ప్రధానకాలువ కోతకు గురై కొట్టుకుపోయిన పంటలు, వేసిన ఇసుకమేటలు, మట్టి దిబ్బలు, రాళ్లను తొలగిం చే ఏర్పాటు చేసి, ఎకరానికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించాలని జా జాల కోరారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై భార్గవ్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని రాస్తారోకోను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తహసీల్దార్ శ్రీనివాస్‌రా వు అక్కడికి చేరుకొని రాస్తారోకో విరమించాలని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఆర్డీవో వచ్చి తమకు మాట ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు తేల్చి చెప్పడంతో.. ఆర్డీవో పార్థ సింహారెడ్డితో మా జీ ఎమ్మెల్యే జాజాల ఫోన్లో మా ట్లాడారు. నెల రోజులవుతున్నా నష్టపోయి న రైతులను ఎందుకు పట్టించుకోవ డం లేదని, పరిహారం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. పోచారం ప్రధాన కాలువ పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేసి పంటలకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.