Hanumant Shinde | జుక్కల్ : బీసీలకు కాంగ్రెస్ మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను చార్సౌ బీస్ హామీలు ఇచ్చి దొంగ హామీలతో మోసం చేసిందని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కేవలం 17 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించిందని బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగే కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. అనంతరం అచ్చంపేట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట నాయకులు దుర్గారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.