లింగంపేట్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ( MLC election ) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ( Narender Reddy) కి మద్దతు ఇవ్వాలని కోరుతూ లింగంపేట మాజీ జడ్పీటీసీ ఏలేటి శ్రీలత సంతోష్ రెడ్డి శనివారం మండలంలోని మోతే, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం (Election campaign) నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. పార్టీ మండల అధ్యక్షుడు నారా గౌడ్ , నాయకులు ఎల్లమయ్య , ప్రసాద్ గౌడ్, రాజు , మాజీ సర్పంచ్ రాంరెడ్డి , సీడీసీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి , మండల కోఆర్డినేటర్, కమిటీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ , మోతె గ్రామ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శంకర్ రావు , సెక్రటరీ సాయిలు , యూత్ ప్రెసిడెంట్ ఏలేటి రాజు తదితరులు పాల్గొన్నారు .